ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఇంద్రావతి జాతీయ పార్కు పరిధిలోని బోటర్ గ్రామంలో ఓ నిండు గర్భిణీ ప్రసవ వేదనతో బాధపడుతోంది. విషయం తెలుసుకున్న ఐటీబీపీ 29వ బెటాలియన్, నారాయణపూర్ పోలీసుల బృందం అక్కడికి చేరుకుంది. జవాన్ల బృందం దట్టమైన అడవి, పర్వత ప్రాంతాల గుండా ఆ మహిళను స్ట్రెచర్‌పై 5 కిలోమీటర్లు కాలినడన ఆస్పత్రికి తరలించింది.