WGL: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు మాదన్నపేటలో శనివారం మహిళలకు ఇందిరమ్మ చీరలను మున్సిపల్ చైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్ పంపిణీ చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వం చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. మహిళా అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. స్థానిక కౌన్సిలర్ పాల్గొన్నారు.