GDWL: అలంపూర్ మండలం కోనేరు గ్రామానికి చెందిన హరికృష్ణ అనే వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉండగా వైద్యానికి కావాల్సినంత ఆదాయం లేకపోవడంతో ప్రభుత్వ పథకానికి ఎమ్మెల్యే చేరువతో దరఖాస్తు చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుంచి మంజూరైన ₹5,00,000 విలువైన ఎల్ఓసీ కాపీని హరికృష్ణ కుటుంబ సభ్యులకు శనివారం అలంపురం ఎమ్మెల్యే విజయుడు అందించారు.