»Metro Revanth Reddy Is A Key Decision For Shamshabad Airport
Revanth Reddy: ఎయిర్ పోర్టుకు మెట్రో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో ప్రకటించిన శంషాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో ప్రణాళికను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో ప్రజలు ఎక్కువగా ప్రయాణించే ప్రాంతాల్లో మెట్రో మార్గాన్ని అన్వేషించాలని అధికారులను ఆదేశించారు.
Metro Revanth Reddy is a key decision for Shamshabad Airport
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి(revanth reddy) రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు ఎయిర్పోర్ట్(Shamshabad Airport) మెట్రో లైన్, టెండర్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ రూట్ కు బదులుగా ఎంజీబీఎస్-ఫలక్‌నుమా, ఎల్బి నగర్ నుంచి చాంద్రాయణగుట్ట మీదుగా ప్రత్యామ్నాయ అలైన్మెంట్లను త్వరగా సిద్ధం చేయాలని హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్ఎంఆర్) అధికారులను బుధవారం రాత్రి సీఎం ఆదేశించారు. నగర జనాభాలో ఎక్కువ భాగం మధ్య, తూర్పు ప్రాంతాలలో, ఓల్డ్ సిటీలో ఉన్నందున, MGBS-ఫలక్‌నుమా నుంచి ఓల్డ్ సిటీ గుండా విమానాశ్రయం మెట్రో అలైన్‌మెంట్‌ను తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.
మైలార్‌దేవ్‌పల్లి, జల్పల్లి P7 రోడ్ల మీదుగా లేదా బార్కాస్-పహాడీషరీఫ్, శ్రీశైలం రోడ్ల మీదుగా అలైన్మెంట్ తీసుకోవడానికి తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాలను సిద్ధం చేయాలని HMRకు సూచించారు. ఇందులో భాగంగా రెండు ప్రత్యామ్నాయాలను రూపొందించాలన్నారు. అయితే ఎయిర్ పోర్ట్ వరకు ఓఆర్ఆర్ ఉన్న నేపథ్యంలో అక్కడి వరకు మెట్రో అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న జరిగిన సమీక్షలో భాగంగా ఈ మేరకు ప్రకటించారు.
పాతబస్తీలో 5.5 కి.మీ మేర పనులు పూర్తి కానప్పటికీ, మెట్రోరైలు రాయితీ సంస్థ ఎల్‌అండ్‌టి మెట్రో రైల్ హైదరాబాద్ (ఎల్అండ్టిఎమ్ఆర్హెచ్)కి అందజేసిన “అనేక ప్రయోజనాల”పై రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఎల్ అండ్ టీఎంఆర్హెచ్, జీఎంఆర్ ఎయిర్పోర్ట్, మెట్రో రైల్ అనుబంధ రాయితీ ఒప్పందాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. సచివాలయంలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు, విస్తరణ ప్రణాళికలు, ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టు తదితర అంశాలపై సవివరంగా సమీక్షించిన సందర్భంగా జీఓ 111 ఏరియా గుండా ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్) వెంబడి ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్‌మెంట్‌పై ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే ORR రూపంలో చాలా మంచి రవాణా సౌకర్యం ఉందని రేవంత్ అన్నారు.
తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, నగరాభివృద్ధికి మధ్య సమతూకంతో వ్యవహరిస్తోందని, మూసీ నదిని సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు దాని ఒడ్డున ఉన్న మార్గాన్ని సద్వినియోగం చేసుకోవడంతోపాటు నగరానికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. MGBS ఇంటర్సిటీ బస్ టెర్మినల్‌ను సరిగ్గా కలుపుతూ నాగోల్ నుంచి గండిపేట వరకు తూర్పు-పశ్చిమ రహదారి-కమ్-మెట్రో రైలు కనెక్టివిటీకి ప్రణాళిక చేయాలన్నారు. కందుకూరు సమీపంలో ప్రతిపాదిత ఫార్మా సిటీ కోసం సేకరించిన భారీ భూముల్లో పర్యావరణ అనుకూల మెగా టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక వేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్రతిపాదిత ఫార్మా సిటీ కాలుష్యాన్ని కలిగించే అవకాశం ఉన్నందున నగరానికి దూరంగా ఉండాలన్నారు. శ్రీశైలం రోడ్‌లోని తుక్కుగూడ మీదుగా ఎయిర్పోర్ట్ ప్రాంతం నుంచి ఈ ప్రతిపాదిత మెగా టౌన్‌షిప్‌కు మెట్రో రైలు కనెక్టివిటీకి ప్లాన్ చేయాలని HMR MDకి సూచించారు.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శి ఎ. శాంతికుమారి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీఎంవో అధికారులు వి.శేషాద్రి, బి.శివధర్‌రెడ్డి మరియు షానవాజ్ ఖాసిం, తదితరులు పాల్గొన్నారు.