RR: నందిగామ మండల కేంద్రంలోని వీర్లపల్లి రోడ్డులోని శ్రీకృష్ణ పరిశ్రమ గోదాంలో ఇవాళ ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. కాటన్ నిల్వలకు మంటలు అంటుకోవడంతో భారీగా చెలరేగాయి. పోలీసులు, ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.