SRPT: కోదాడలో టీడీపీ మళ్లీ పుంజుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ నెల 29న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బైక్ ర్యాలీతో బలాన్ని చాటాలని నిర్ణయించింది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పల్లెపల్లెనా సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలను సమాయత్తం చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది.