గోవా బ్యూటీ ఇలియానా పెళ్లిపీఠలెక్కబోతోందనే న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఒకప్పుడు తన అందంతో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ మోజులో ముంబైకి మకాం మార్చేసింది. దేవదాసుతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా.. ఆ తర్వాత పోకిరి, మున్నా, జల్సా వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్గా రాణించింది. అంతేకాదు టాలీవుడ్లో కోటి పారితోషికం అందుకున్న బ్యూటీల్లో ఇలియానాదే ఫస్ట్ ప్లేస్. అలాంటి ఈ గోవా బ్యూటీ బాలీవుడ్‌కు వెళ్లి.. ఇక్కడి ఆఫర్లకు దూరమైంది. ఇప్పటికీ అక్కడ అడపా దడపా సినిమాలు చేస్తున్నప్పటికీ.. అనుకున్నంత రేంజ్లో మాత్ర సక్సెస్ అవలేకపోయింది.
ఇక అమ్మడి ప్రేమ వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోస్‌తో ప్రేమలో పడింది ఇలియానా. అతనితో చాలా కాలం పాటు చెట్టపట్టాలేసుకొని తిరిగింది. కానీ చివరికి ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ విషయంలో ఇలియానా డిప్రెషన్లోకి కూడా వెళ్లిపోయింది. ఇక అప్పటి నుంచి ఒంటిరిగానే ఉన్న ఇల్లీ బేబి.. రీసెంట్గా మరో కొత్త ప్రేమకథతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా లవ్‌లో ఉన్నట్టు చాలా రోజులుగా వినిపిస్తోంది. దాంతో ఈ మధ్య ఎక్కడెకెళ్లినా ఇద్దరు కలిసే వెళ్తున్నారట. అయితే లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. సెబాస్టియన్‌తో ఇలియానా పెళ్లి పీఠలెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరు కలిసి తెగ షాపింగ్ చేస్తున్నారట. అందుకే త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. కాకపోతే ఇలాంటి వార్తల్లో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.