ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సానియా మీర్జా, రోహన్ జోడీ ఫైనల్ కు చేరింది. రోహన్ బోపన్నతో కలిసి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సానియా ఫైనల్స్ కు దూసుకెళ్లింది. నీల్ స్కుప్స్కి, డిసిరే క్రావ్జిక్ జోడీని సెమీస్ లో సానియా జోడి ఓడించింది. మ్యాచ్ తర్వాత సానియా మీడియాతో మాట్లాడింది. అద్భుతమైన మ్యాచ్ ఆడానని, రోహన్ తో కలిసి తన చివరి గ్రాండ్ స్లామ్ టైటిల్ పోరులో ఆడటం బాగుందని సానియా తెలిపింది.
సానియాకు 14 ఏళ్లు ఉన్నప్పుడు రోహన్ తో కలిసి ఆడింది. అప్పటి నుంచి రోహన్ తన మిక్స్డ్ డబుల్స్ పార్ట్ నర్ అని తెలిపింది. ఇప్పుడు తనకు 36, రోహన్ కు 42 ఏళ్ల వయసని, ఇప్పుడు కూడా తామిద్దరం కలిసి ఆడటం చాలా ఆనందంగా ఉందన్నారు. టెన్నిస్ ప్లేయర్లుగా తమ మధ్య మంచి బంధం ఉందని సానియా తెలిపింది. ఆస్ట్రేలియాలో మ్యాచ్ ఆడుతుంటే అక్కడి భారతీయులు తమకు ఎంతో మద్దతుగా నిలిచారన్నారు.