CTR: వనమలదిన్నెకు చెందిన లావణ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పుంగనూరుకు చెందిన హేమప్రద పరిచయమైంది. తనకు కాబోయే భర్త అశోక్ సీబీఐ అధికారి అని లావణ్యను నమ్మించింది. రూ. 10 లక్షల డబ్బులు, రూ. 45 లక్షల చెక్కులు తీసుకొని మోసం చేశారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ సుబ్బారాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.