కెజియఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న కన్నడ స్టార్ హీరో యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ముందు నుంచి వినిపించినట్టుగానే ఇంట్రెస్ట్ టైటిల్‌తో.. లేడీ డైరెక్టర్‌తో సినిమాను ప్రకటించాడు. అలాగే రిలీజ్ డేట్ కూడా లాక్ చేశాడు.
కేజీయఫ్ సిరీస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు కన్నడ రాకింగ్ స్టార్ యష్. కేజీయఫ్ చాప్టర్ 2తో ఏకంగా 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాడు. కేజీయఫ్ చాప్టర్ వన్ కూడా కలుపుకుంటే 1500 కోట్ల వరకు రాబట్టాడు యష్. అలాంటి ఈ స్టార్ హీరో ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. కేజీయఫ్ జోష్‌లో కొత్త సినిమా స్టార్ట్ చేస్తాడని భావించిన యష్ అభిమానులు.. ఈ విషయంలో నిరాశకు గురయ్యారు. ఎట్టకేలకు ఇప్పుడు అభిమానుల్లో జోష్ నింపాడు యష్.
తన కెరీర్లో 19వ సినిమాగా రానున్న ప్రాజెక్ట్ టైటిల్ అనౌన్స్ చేశాడు. ముందుగా చెప్పినట్టుగా డిసెంబర్ 8 ఉదయం 9 గంటల 55 నిమిషాలకు రివీల్ చేశారు. అలాగే ముందు నుంచి వినిపిస్తున్నట్లుగానే మళయాళీ టాలెంటెడ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ డైరెక్షన్లోనే ఈ సినిమా అనౌన్స్ చేసాడు. ఈ మూవీకి ‘టాక్సిక్’ అనే టైటిల్ ప్రకటించారు. టైటిల్ అనౌన్స్మెంట్ మోషన్ పోస్టర్లో కూడా గన్ పట్టుకుని రాఖీ భాయ్లా కనిపించాడు యష్.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరింది. అయితే ఈ సినిమా ఇతర కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ పై క్లారిటీ ఇవ్వలేదు. కానీ 2025 ఏప్రిల్ 10న సినిమాని విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేసారు. అంటే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రావడానికి మరో ఏడాదిన్నర సమయం ఉందన్న మాట. వీలైనంత త్వరగా ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటికే శ్రీలంకలో 45 రోజులపాటు సింగిల్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని టాక్. అన్నట్టు ఈ సినిమా డ్రగ్స్ బ్యాక్ డ్రాప్లో ఉంటుందని సమాచారం. మరి యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.