»Varun Tej And Lavanya Enjoying Their Winter Honeymoon In Finland
Varun Tej: హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న వరుణ్, లావణ్య..!
బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో వరుణ్ తేజ్, లావణ్యలు ఒకరు. ఆరేళ్లపాటు ప్రేమించుకున్న ఈ జంట రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి ఇటలీలో చాలా గ్రాండ్ గా నిర్వహించారు. మెగా ఫ్యామిలీ, ఇతర సెలబ్రెటీలు సైతం ఆ పెళ్లిలో పాల్గొని సందడి చేశారు. ఇటలీలో పెళ్లి తర్వాత హైదరాబాద్ లో ఈ జంట గ్రాండ్ రిసెప్షన్ కూడా నిర్వహించారు.
ఈ మధ్యనే వరుణ్ తేజ్, లావణ్యలు హనీమూన్ కి వెళ్లారు. నవంబర్‌లో వివాహం తర్వాత వారు మొదటిసారి హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. వరుణ్ తేజ్, లావణ్య తమ హనీమూన్‌ను ఫిన్లాండ్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. శీతాకాలపు వండర్‌ల్యాండ్‌లో చల్లని వైబ్‌లను ఆస్వాదిస్తున్నాడు. వరుణ్ తేజ్, లావణ్యలు ఫిన్లాండ్లో తమ హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలకు మెగా అభిమానులు లైకుల వర్షం కురిపిస్తున్నారు.
కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన వరుణ్, లావణ్య నవంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి సినీ సెలబ్రిటీలు సైతం హాజరయ్యారు. పెళ్లి జరిగిన మూడు రోజుల తర్వాత హైదరాబాద్‌లో స్టార్-స్టడెడ్ రిసెప్షన్ జరిగింది. పలువురు టాలీవుడ్ నటులు, ప్రముఖులు ఈ రిసెప్షన్‌కు హాజరయ్యారు. అలాగే లావణ్య కుటుంబం, స్నేహితులకు కూడా డెహ్రాడూన్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. ఇకపోతే హీరో వరుణ్ తేజ్ ఈ మధ్యే తన తదుపరి చిత్రం ఆపరేషన్ వాలెంటైన్ షూటింగ్‌ను పూర్తి చేశాడు. అందులో వరుణ్ IAF అధికారిగా నటించాడు. డిసెంబరు 8వ తేదిన ఆ సినిమా విడుదల కావాల్సి ఉండగా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ ప్రకటించారు.