MBNR: మహమ్మదాబాద్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగడంపై గృహ నిర్మాణ శాఖ పీడీ వెంకట ఉపేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. నిధుల జమలో జాప్యం, స్థలాల కొరత వల్లే పనులు ఆగాయని సర్పంచ్ రాంలాల్ ఆయనకు వివరించారు. ఈ సమస్యలను 2-3 రోజుల్లో పరిష్కరించి, నిర్మాణాలను వేగవంతం చేస్తామని పీడీ హామీ ఇచ్చారు.