MHBD: కొత్తగూడ మండలం మోకాళ్ళపల్లిలో కుంజ సూర్య ఆధ్వర్యంలో శుక్రవారం ఆదివాసీ ముద్దు బిడ్డ, ప్రజా యుద్ధ వీరుడు కామ్రేడ్ కుంజ రామన్న 21వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ జాతీయ, రాష్ట్ర, మండల నాయకులు రామన్న చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. తుడుం దెబ్బ నాయకులు తదితరులు ఉన్నారు.