ADB: శ్రీరామనవమి సందర్భంగా ఆదిలాబాద్‌లోని పాత హౌసింగ్ బోర్డ్ కాలనీ సీతారామాంజనేయ స్వామి, తీర్పెల్లి రామాలయాల్లో కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, తహసీల్దార్ శ్రీదేవి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.