సోషల్ మీడియాలో వస్తున్న డేటింగ్ రూమర్లపై నటి మలైకా అరోరా ఘాటుగా స్పందించింది. తన ఉనికి కోసం, పరిపూర్ణత కోసం పురుషుడి తోడు అవసరం లేదని, చిన్నప్పటి నుంచి స్వయంకృషితో ఎదిగానని స్పష్టం చేసింది. ప్రస్తుతం తోడు కోసం వెతకడం లేదని పేర్కొంది. భవిష్యత్తులో ఎవరితోనైనా ఉండాలనిపిస్తే అది తన వ్యక్తిగత నిర్ణయమని, ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని ఆమె తేల్చి చెప్పింది.