»I Am A Hero Because Of Him Nitin Comments Are Viral
Nitin: ఆయన వల్లే నేను హీరోగా వున్నాను.. హీరో కామెంట్స్ వైరల్
యంగ్ హీరో నితిన్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాతో ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ క్రమంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నితిన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
I am a hero because of him.. Nitin comments are viral
Nitin: ప్రస్తుతం నితిన్, వక్కంతం వంశీ డైరెక్షన్లో ‘ఎక్స్ట్రా ఆర్డీనరి మ్యాన్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. డిసెంబర్ 8న ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండడంతో.. సినిమా పై మంచి బజ్ ఉంది. అలాగే.. ఈ చిత్రంలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమా పై నితిన్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్గా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకు తగ్గట్టే గట్టిగా ప్రమోషన్స్ చేస్తున్నాడు నితిన్.
ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేదిక పై నితిన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘రాజశేఖర్ గారు చేసిన ‘మగాడు’ సినిమాతో మా నాన్న డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది కాబట్టే.. మా నాన్న ఇండస్ట్రీలో ఉన్నారు. అందుకే.. ఈ రోజు నేను హీరోగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఇలా మళ్లీ మీరు నా సినిమాలో స్పెషల్ రోల్ చేసినందుకు థ్యాంక్స్.. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు.. అని చెప్పుకొచ్చాడు. ఫైనల్‌గా డిసెంబర్ 8న గట్టిగా కొట్టబోతోన్నాం, సిద్ధంగా ఉండండి.. అని నితిన్ తెలిపాడు. ఏదేమైనా.. ఈ రోజు నితిన్ హీరోగా నిలబడడానికి ఇండైరెక్ట్‌గా రాజశేఖరే కారణమని చెప్పొచ్చు. తిన్ సినిమాతోనే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని చూస్తున్నాడు రాజశేఖర్. మరి ‘ఎక్స్ట్రా ఆర్డీనరి మ్యాన్’ ఎలా ఉంటుందో చూడాలి.