పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ ఛత్రపతి.. అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా సమయంలోనే బాహుబలి ప్రాజెక్ట్‌కు చేయాలని ఫిక్స్ అయ్యారు రాజమౌళి, ప్రభాస్. ఇక బాహుబలి ఎంత సంచలనంగా నిలిచిందో అందరికీ తెలిసిందే. అందుకే ఛత్రపతి సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. అయితే బాలీవుడ్ హీరో కాకుండా.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ రీమేక్‌లో నటిస్తున్నాడు. అల్లుడు శీను సినిమాతో సాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేశాడు డైరెక్టర్ వి.వి.వినాయక్. ఇక ఇప్పుడు ఛత్రపతి రీమేక్‌తో బాలీవుడ్లో ఇంట్రడ్యూస్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఇప్పటికే సాయి శ్రీనివాస్ నటించిన సినిమాలు హిందీలో డబ్ అయి.. యూట్యూబ్‌లో రిలీజ్ అయి.. భారీ వ్యూస్ సొంతం చేసుకున్నాయి. దాంతో ఛత్రపతి రీమేక్ సాయికి కలిసొస్తుందని అనుకుంటున్నారు. కానీ ఎప్పుడో మొదలైన ఈ ప్రాజెక్ట్.. ఇప్పటి వరకు కంప్లీట్ అవలేదు. ఆ మధ్య బెల్లంకొండ సురేష్.. ఈ సినిమా అవుట్ పుట్ అదిరిపోయిందని.. వినాయక్‌కు బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నాయని చెప్పుకొచ్చారు. అది తప్పితే ఛత్రపతి నుంచి మరో అప్డేట్ లేదు. కానీ తాజాగా ఈ సినిమాను థియేటర్లలో కాకుండా.. ఓటీటీలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమా కోసం.. సరికొత్తగా మేకోవర్ అయ్యాడు. ఎంతో హార్డ్ వర్క్ చేశాడు. చాలా సమయం కేటాయించాడు. కానీ ఇప్పుడు ఓటిటిలో రిలీజ్ అంటున్నారు. మరి దీనిపై మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.