WGL: గీసుకొండ మండలం దస్రునాయక్ తండా శివారు మంగళితండా ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు పి. శ్రీనివాసును గురువారం కలెక్టర్ సత్యశారద సస్పెండ్ చేశారు. ఉదయం 7.45 గంటలకు పాఠశాలను సందర్శించిన కలెక్టర్, ఉపాధ్యాయుడు సమయానికి రాకపోవడాన్ని గుర్తించారు. జిల్లా విద్యాశాఖాధికారి ద్వారా సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.