MNCL: హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసినట్లు తాండూర్ CI దేవయ్య తెలిపారు. బెల్లంపల్లికి చెందిన భరత్ మార్చి 23న రెబ్బెనలోని తాత ఇంటికి వెళ్ళాడు. స్నేహితులైన పవన్ కళ్యాణ్, రాజు, వంశీ కలిసి మద్యం సేవిస్తుండగా గొడవ పడ్డారు. అక్కడికి వచ్చిన కిరణ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో భరత్‌ను పొడవగా గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు.