BDK: సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటనకు ముందు ఆదివాసీ తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలెం కోటిని పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాములవారి కళ్యాణం ప్రజలందరి ఉత్సవమని ఇలాంటి సమయంలో ఆదివాసీ నాయకులను నిర్బంధించడం సరికాదని మండిపడ్డారు. మణుగూరు పోలీసుల తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అన్నారు.