తెలుగు రాష్ట్రాల్లో షారుక్ ఖాన్‌ను రణబీర్ కపూర్ అధిగమించాడు. అవును, మీరు విన్నది నిజమే. రణబీర్ కపూర్ నటించిన తాజా చిత్రం యానిమల్ విపరీతమైన ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో షారుక్ ఖాన్‌ను రణబీర్ కపూర్ మించిపోయాడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో యానిమల్కి వచ్చిన ఓపెనింగ్స్ చూసి అందరూ షాక్‌కు గురవుతున్నారు. దర్శకుడు సందీప్ వంగా బ్రాండ్ ఈ చిత్రానికి ఇంత భారీ ఓపెనింగ్స్ నమోదు చేయడంలో సహాయపడిందనడంలో సందేహం లేదు. రణబీర్ కపూర్ నటన కూడా ఈ భారీ ఓపెనింగ్‌కు కారణం అయ్యింది. విడుదలకు ముందే యానిమల్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ అంచనా వేసింది.
యానిమల్ తెలుగు రాష్ట్రాల ప్రారంభ అంచనాలు 18 కోట్ల గ్రాస్ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇది ఒక సంచలనాత్మక ఫీట్ అని చెప్పొచ్చు. ఈ చిత్రం భారీ తేడాతో షారుక్ ఖాన్ ‘జవాన్’ రికార్డును బద్దలు కొట్టింది. ఈ సినిమాలో తన నటనతో పాటు స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఎంతో మంది అభిమానులను క్రియేట్ చేసుకున్న రణబీర్ కి తెలుగు రాష్ట్రాల్లో గేమ్ ఛేంజర్ సినిమాగా మారింది.
షారుఖ్ ఖాన్ ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామిగా ఉన్న స్టార్, రణబీర్ కపూర్ అతన్ని మించిపోయినట్లు తెలుస్తోంది. ఆయన తదుపరి చిత్రాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్‌ను రాబడతాయని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇక ఇప్పటి నుంచి రణబీర్ ఏ సినిమా తీసినా, అది తెలుగులోనూ విడుదల చేయడం ఖాయమని తెలుస్తోంది. యానిమల్ చూసిన తర్వాత తెలుగులోనూ రణబీర్ కి బీభత్సంగా ఫ్యాన్స్ పెరగడం విశేషం.