ASF: జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపిక కావడం జరిగిందని జిల్లా బాల్ బాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తిరుపతి ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 27 నుంచి 30 వరకు తమిళనాడు రాష్ట్రంలో జరగనున్న పోటీలకు బాలుర విభాగంలో సాయి చరణ్, బాలికల విభాగంలో అంజలి, అనూష ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు మంచిపేరు తేవాలన్నారు.