MNCL: బెల్లంపల్లి కోదండ రామాలయ ఉత్సవ కమిటీని MLA వినోద్ ప్రకటించారు. ఆలయ ఛైర్మన్గా బండి రాము, డైరెక్టర్లుగా పరమేష్, విజయలక్ష్మి, వెంకటేష్, కృష్ణ, గోవర్ధన్ రావు, శ్రీనివాస్, కుమారస్వామి నియమితులయ్యారు. వారికి MLA వినోద్ నియామక పత్రాలు అందజేశారు. ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసి, ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.