AP: శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్రప్రజలకు CM చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడు ధర్మానికి, సుపరిపాలనకు ప్రతీకగా నిలిచిన ఆదర్శ పురుషుడు, కర్తవ్య పరాయణుడని పేర్కొన్నారు. శ్రీరాముడు అంటేనే ప్రజారంజక పాలన అని, అలాంటి రామరాజ్య స్థాపనకు మన వంతు కర్తవ్యం నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. అందరి పట్ల శ్రీరాముడి కృపాకటాక్షం కలగాలని కోరుకుంటున్నట్లు ప్రార్థించారు.