ELR: విశాఖపట్నం-చర్లపల్లి రైలును క్రమబద్ధీకరిస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం-చర్లపల్లి ఎక్స్ప్రెస్ (18527) ఏప్రిల్ 3 నుంచి, చర్లపల్లి-విశాఖపట్నం ఎక్స్ప్రెస్ (18528) ఏప్రిల్ 4 నుంచి నడపనున్నారు. దువ్వాడ, అనకాపల్లి, తుని, రాజమహేంద్రవరం, ఏలూరు, ఖమ్మం, వరంగల్, ఖాజీపేట స్టేషన్లలో రైలు ఆగుతుందన్నారు. ప్రయాణికులు గమనించాలి.