GDWL: వాహనదారులు బాధ్యతాయుతంగా వాహనాలు నడిపి సురక్షిత ప్రయాణం చేయాలని అయిజ ఎస్సై కిరణ్ కుమార్ పేర్కొన్నారు. గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశం మేరకు పట్టణంలోని కర్నూలు-రాయచూరు చౌరస్తాలో అరైవ్- అలైవ్ కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. అధిక వేగంతో వాహనాలు నడపరాదని, ఎడమ వైపు నుంచి ఓవర్ టేక్ చేయరాదని సూచించారు.