C-PAC: తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ వరసగా మూడోసారి అధికారం చేపట్టే అవకాశం కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు పట్టం కట్టారు.. ఈ విషయాన్ని సివిక్ పోల్స్ ఆనాలిసిస్ కమిటీ (సీ-ప్యాక్) ప్రకటించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవనుంది. సీ ప్యాక్ (C-PAC) ప్రకారం కాంగ్రెస్ పార్టీ 65 సీట్లు గెలుచుకుంటుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది. దీంతో ఈజీగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అధికార బీఆర్ఎస్ పార్టీ 41 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమైంది. బీజేపీ కేవలం 4 సీట్లలో మాత్రం విజయం సాధించనుంది. అనూహ్యంగా బీఎస్పీ రెండు చోట్ల గెలుస్తోందని పేర్కొంది. మజ్లిస్ 5 సీట్లే గెలుచుకుంటుందట. ఆ పార్టీ 7 చోట్ల పోటీ చేసింది. అంటే 2 సీట్లను కోల్పోనుంది. ఎంబీటీ ఒక చోట, సీపీఐ పోటీ చేసిన ఒక చోట గెలవనున్నాయి.