జగిత్యాల జిల్లాలో రాబోయే 2025-26 వరి ధాన్యం కొనుగోళ్లపై అధికారులు శ్రద్ధ వహించాలని కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. వరి ధాన్యం కొనుగోళ్లపై గురువారం వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా క్యాండీ క్లీనింగ్ మెషిన్లు ఏర్పాటు చేయాలని, టోకెన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. అవసరమైన టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు.