»Rain Alert For Telugu States Ap And Telangana November 29th 2023
Rain alert: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్..ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా వానలు పడే అవకాశం ఉందని తెలిపింది.
Rain alert for Telugu states ap and telangana november 29th 2023
ఆంధ్రప్రదేశ్(andhra pradesh) రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు(rains) కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని దక్షిణ కోస్తా ప్రాంతంలో గురువారం కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందన్నారు. వాతావరణ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న మలక్కా జలసంధిపై అల్పపీడనం ఏర్పడింది. ఆ క్రమంలో మంగళవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో అది పశ్చిమ దిశగా కదిలి దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా వెళ్లింది.
ఇది నవంబర్ 30 నాటికి పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. అల్పపీడనం తదనంతరం వాయువ్య దిశగా పయనించి 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపానుగా మారుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబరు 4 నుంచి 6 వరకు కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ అంచనా వేసింది.
మరోవైపు తెలంగాణ(telangana) రాష్ట్రంలో కూడా వచ్చే నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఈ మేరకు అంచనా వేశారు. రానున్న భారీ వర్షాల దృష్ట్యా తమ పంట కోతకు సిద్ధంగా ఉంటే వెంటనే కోయాలని ఐఎండీ రైతులకు సూచించింది.