»Rains For The Telangana Next 3 Days August 18 To 20th 2023
Telangana rains: తెలంగాణలో వచ్చే 3 రోజులు వర్షాలు!
తెలంగాణ(telangana)లో రాబోయే మూడు రోజులు వర్షాలు(rains) కురియనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 18, 19, 20 తేదీలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Rains for the telangana next 3 days august 18 to 20th 2023
తెలంగాణ(telangana)లో మళ్లీ భారీ వర్షాలు(rains) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ అంచనా వేసింది. అయితే ఈ వర్షాలు ఆగస్టు 18, 19, 20 తేదీలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో వాతావరణ శాఖ రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఈశాన్య బంగాళాఖాతం ఎగువన ఏర్పడిన వాయుగుండం ఉత్తర దిశగా కదులుతున్నందున రానున్న మూడు రోజులు వానలు కురియనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
అయితే ప్రధావంగా ఉత్తర తెలంగాణపై మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని..తెలంగాణలోని మిగిలిన ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఇక హైదరాబాద్ విషయానికొస్తే వచ్చే మూడు రోజుల పాటు నగరంలో తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని డిపార్ట్మెంట్ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.