TS Weather : తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్.. నాలుగు రోజులు వర్షాలు
తెలంగాణాకి చల్లని కబురు వచ్చింది. రాగ నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
TS Weather : తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అదే సమయంలో పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
సోమవారం ఖమ్మం, సూర్యపేట, జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని చెప్పింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సమయంలో కొన్ని జిల్లాల్లో వడగాలులు, కొన్ని జిల్లాల్లో చిరు జల్లులు పడే అవకాశాలుంటాయని వాతావరణ కేంద్రం తెలింపింది. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలు వీస్తాయన్న పేర్కొంది.
సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు పడుతాయని చెప్పింది. మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందన్న వాతావరణ శాఖ ఆయా ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.