ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 ది రూల్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. లెక్కల మాస్టారు సుకుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు టీజర్‌ను విడుదల చేశారు.
Pushpa 2: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 ది రూల్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈరోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో టీజర్‌ను విడుదల చేస్తామని మూవీ మేకర్స్ ముందుగానే ప్రకటించారు. చెప్పినట్లుగానే మేకర్స్ పుష్ప 2 టీజర్‌ను విడుదల చేశారు. పుష్ప 2 టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరోసారి బన్ని తన యాక్టింగ్‌తో ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. టీజర్‌తో సినిమాపై అంచనాలు ఇంకా పెరుగుతున్నాయి. పూర్తిగా మాస్ అవతారంలో బన్నీ.. దేవి శ్రీ అందించిన బీజీఎం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే బన్నీ ఇదివరకు ఎన్నడూ కనిపించని గెటప్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది.
పట్టుచీరలో మెడలో నిమ్మకాయాల మాలతో ఒంటినిండా బంగారు ఆభరణాలతో అమ్మోరు గెటప్‌లో కనిపించారు. గంగమ్మ జాతరలో ఉగ్రరూపంతో నడిస్తూ.. చీరకొంగును నడుముకు చుట్టుకుంటూ వస్తున్నట్లు చూపించారు. టీజర్ మొత్తంలో ఒక్క డైలాగ్ లేకుండా బీజీఎంతో గూస్ బంప్స్ తెప్పించారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించనున్నారు. టీజర్ ఈ రేంజ్లో ఉంటే ఇంకా సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.