PLD: జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నాన్ బెయిలబుల్ వారంట్ల (NBWs) అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా అదనపు ఎస్పీ జెవి. సంతోష్ ఆదేశించారు. నరసరావుపేట పోలీస్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఫిబ్రవరి–2026 నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నమోదైన వివిధ నేరాలపై సమగ్ర సమీక్ష జరిపారు.