హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మెట్రో రైలును అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎల్బీనగర్ – మియాపూర్, రాయదుర్గం – నాగోల్, ఎంజీబీఎస్ – జేబీఎస్ మార్గాల్లో మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో భాగ్యనగర వాసులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు మెట్రో సిద్ధమైంది. హైదరాబాద్ మెట్రో. ఈ మేరకు మెట్రో ఛార్జీలపై ఫేర్ ఫిక్సేషన్ కమిటీ అధ్యయనం చేస్తోంది. ఆ నివేదిక ఆధారంగా త్వరలో ఛార్జీల పెంపు ఉండనుందని ప్రచారం జరుగుతోంది. అయితే, విద్యుత్, నిర్వహణ భారం, ఖర్చులు పెరగడంతో మెట్రో చార్జీలను 25 నుంచి 30 శాతం వరకు పెంచేందుకు హైదరాబాద్ మెట్రో కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం మెట్రో ప్రయాణ కనీస చార్జీ రూ.10 కాగా, గరిష్టంగా రూ. 60 గా ఉంది. ఇక తాజా పెంపు ప్రతిపాదనలో భాగంగా ఎంత పెంచుతారనేది త్వరలో తేలనుంది. కాగా.. ఆర్థికంగా బలపడేందుకు ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో సంస్థ దృష్టి పెట్టింది.