Extra ordinary man: ట్రైలర్ రిలీజ్..మైసమ్మ..ఈసారి నితిన్ కొట్టాల్సిందే!
యంగ్ హీరో నితిన్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అందుకుంటున్నాడు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో వస్తున్నాడు. అందుకే.. ఈసారి మన మైసమ్మ తల్లిని నమ్ముకున్నాడు. తాజాగా నితిన్ లేటెస్ట్ ఫిల్మ్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్(extra ordinary man) టీజర్ రిలీజ్ చేశారు.
ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ(vakkantham vamsi) డైరెక్షన్లో ‘ఎక్స్ట్రా ఆర్డీనరి మ్యాన్(extra ordinary man)’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. డిసెంబర్ 8న ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ రాబోతున్నాడు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండడంతో.. దీని పై మంచి బజ్ ఉంది. పైగా ఈ చిత్రంలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీంతో నితిన్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్(trailer) రిలీజ్ చేశారు. ముందుగా టీజర్‌తో ఇది పక్కా ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసిన నితిన్.. ట్రైలర్తోను అదే చెబుతున్నాడు. చిన్నతనం నుంచి తనలా కాకుండా.. డిఫరెంట్‌గా ఉండాలనుకునే ఓ కుర్రాడి లైఫే ఈ సినిమా కథ అన్నట్టుగా తెలుస్తోంది. అందుకే.. డిఫరెంట్‌గా కనిపించడానికి సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్‌లా మారతాడు హీరో. అది నాన్నకు నచ్చదు. అయినా కూడా జూనియర్ ఆర్టిస్ట్‌గా ఎప్పుడు వెనకాలే ఉంటూ ఉంటాడు.
ఈ క్రమంలో మైసమ్మను మిరాకల్ కావాలని అడగడంతో హీరో లైఫ్ టర్న్ అవుతుంది. ఇక్కడి నుంచి కథ వేరే అన్నట్టుగా ట్రైలర్ కట్ చేశారు. ఇక ట్రైలర్ చివర్లో యాంగ్రీమ్యాన్ రాజశేఖర్ ఎంట్రీ సినిమాపై హైప్ ఇస్తుంది. ఇందులో రాజశేఖర్(rajasekhar) ఫుల్ గడ్డంతో సరికొత్తగా కనిపిస్తున్నాడు. మొత్తంగా ఈ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని ట్రైలర్‌తో చెప్పేశాడు వక్కంతం వంశీ. మరి అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’తో హిట్ కొట్టలేకపోయినా వక్కంతం ‘ఎక్స్ట్రా ఆర్డీనరి మ్యాన్’తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.