Tillu Square: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రాధిక సాంగ్
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ హీరోహీరోయిన్లుగా వస్తున్న టిల్లు స్క్వేర్ చిత్రం నుంచి రాధిక అనే వీడియో సాంగ్ తాజాగా విడుదల అయింది. విడుదలైన గంటకే దాదాపు రెండు లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుని సోషల్ మీడియాలో ఈ సాంగ్ హల్ చల్ చేస్తుంది.
Tillu Square: హీరో సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) ఈ పేరు వినగానే డీజే టిల్లు గుర్తుకు వస్తుంది. ఆ చిత్రంతో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. అందుకే దానికి సీక్వెల్‌గా టిల్లు స్క్వేర్(Tillu Square) తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రాధిక(Radhika song) అనే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. రాధిక.. రాధిక.. నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే.. నీ బొంగులో మాటలు విని పడిపోయానే అంటూ సాగే ఈ పాటను రామ్ మిరియాల సంగీతంతో పాటు ఆలపించారు. ప్రముఖ పాటల రచయిత కాసర్ల శ్యామ్ సాహిత్యం సమకూర్చారు.
డీజే టిల్లు సినిమాతో రాధిక పాత్ర ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో, దానికి ఫ్రస్టేట్ అవుతూ టిల్లు చెెప్పే డైలాగులు ఎంత ఫేమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పాత్ర స్ఫూర్తితోనే రాధిక పాటను తెరకెక్కించినట్లు తెలుస్తుంది. సాంగ్ స్టార్ట్ అవడానికి ముందు సిద్దు జొన్నలగడ్డ, అనుపమ మధ్య వచ్చే డైలాగ్స్ చాలా ఆసక్తికరంగా సాగింది. సితార ఎంటర్టయిన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాారు. ఈ వినోద్మాక చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న విడుదల అవుతుంది.