Alia Bhatt Deep Fake: అలియా భట్ డీప్ ఫేక్ వీడియో వైరల్
డీప్ ఫేక్ వీడియోలతో సెలబ్రెటీలు ఆందోళన చెందుతున్న వేళా అలియా భట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దాంతో బాలీవుడ్ వర్గాలు ఒక్కసారిగా షాక్ అయ్యాయి. చూడటానికి అచ్చం అలియా భట్లానే ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు కూడా ఆగ్రహంగా ఉన్నారు.
Alia Bhatt Deep Fake: సోషల్ మీడియా(Social Media)లో ఆకతాయిల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. హీరోయిన్ల పార్ఫింగ్ వీడియోలతో రెచ్చిపోతున్నారు. రష్మిక మందన్న(Rashmika Mandanna), కత్రినా కైఫ్(Katrina Kaif), కాజోల్(Kajol)లాంటి ప్రముఖ హీరోయిన్లను డీప్ ఫేక్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే వరుసలో అలియా భట్(Alia Bhatt) చేరింది. అలియా ఫేస్ మార్ఫింగ్ చేసిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతోంది. ఆర్టిఫికల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి ఇలాంటి వీడియోలను క్రియేట్ చేయడంతో అందరిలో ఆందోళనలు మొదలయ్యాయి.
డీప్‌ఫేక్ వివాదాలలో తాజాగా అలియా భట్ వీడియో ఆన్లైన్లో దర్శనం ఇచ్చింది. ఆలియా ముఖంతో నీలిరంగు దుస్తులు ధరించిన ఒక అమ్మాయి కెమెరాకు కొన్ని సంజ్ఞలు చేస్తున్నట్లు వీడియోలో ఉంది. కొన్ని రోజుల క్రితం, కాజోల్ వీడియో ఆన్లైన్లో కనిపించింది. ఒరిజినల్ క్లిప్‌లో ఇన్ఫ్లుయెన్సర్ రోసీ బ్రీన్ ఉన్నారు. గెట్ రెడీ విత్ మి అనే ట్రెండ్‌లో భాగంగా టిక్‌టాక్‌లో ఆ క్లిప్‌ను షేర్ చేసింది. దాంతో ఆకతాయిలు డీప్‌ఫేక్‌లో బ్రీన్ ముఖాన్ని కాజోల్‌తో భర్తీ చేశారు. దీంతో కాజోలే బట్టలు మార్చుకున్నట్లు కనిపించడంతో పెద్ద దుమారమే అయింది. దానికి ముందే హీరోయిన్ రష్మిక మందన్న క్లిప్ వైరల్ అయింది. ఆ ఒరిజినల్ క్లిప్ కూడా ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ది. మరి అలియా మార్పింగ్ వీడియో ఎవరిదన్నది తెలియాల్సి ఉంది.