»Bjps Support For Declaring Bc Candidate As Cm Pawan Kalyan
Pawan Kalyan: బీసీ అభ్యర్థిని సీఎంగా ప్రకటించినందుకే బీజేపీకి మద్దతు
తెలంగాణలో బీజేపీ పార్టీ బలపడుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బీసీ అభ్మర్థిని సీఎంగా ప్రకటించినందుకే ఆయన బీజేపీకి మద్దతు ఇచ్చానన్నారు. ఏపీ తనకు జన్మనిస్తే తెలంగాణ తనకు పునర్జన్మ ఇచ్చిందని, ఇక్కడి ప్రజలకు అన్యాయం జరిగితే తిరగబడతానని తెలిపారు.
BJP's support for declaring BC candidate as CM.. Pawan Kalyan
Pawan Kalyan: తెలంగాణలో ఎన్నికల జోరు పెరిగింది. అన్ని పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలంగాణలో ప్రచారం చేపడుతున్నారు. బీజేపీ(BJP)తో కలిసి పోటీ చేస్తున్న ఆయన అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారాల్లో పాల్గొని ప్రసంగిస్తున్నారు. బీసీలను ఆదుకునేది కేవలం బీజేపీ పార్టీనే అని, అందుకే ఆయన మద్దతిచ్చినట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన సభలో పవన్ పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, బీసీలకు రాజ్యాధికారం ఇస్తోందని అన్నారు.
బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి శంకర్‌గౌడ్ తరపున ఎన్నికల ప్రచారంలో పవన్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీసీల చేతికి రాజ్యాధికారం రావాలని కోరారు. బీసీ అభ్యర్థిని సీఎంగా ప్రకటించిన బీజేపీ పార్టీని ప్రజలు స్వాగతించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ తనకు జన్మనిస్తే, తెలంగాణ పునర్జన్మనిచ్చిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి తాను రుణపడి ఉంటానన్నారు. ఇక్కడ ప్రజలకు అన్యాయం జరిగితే తిరగబడతానన్నారు. కేంద్రంలో కూడా మళ్లీ బీజేపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.