మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. అతడు, ఖలేజా తర్వాత దాదాపు 12 ఏళ్లకు.. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయిన సంగతి తెలిసిందే. SSMB28 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ మూవీ.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఎప్పుడో లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్నఈ మూవీ రెగ్యులర్ షూటింగ్.. గత కొన్ని నెలలుగా పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 12న హైదరాబాద్‌లో ఫార్మల్గా షూటింగ్ మొదలు.. 13 నుంచి నాన్ స్టాప్‌గా షూట్ చేయనున్నారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్లో యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయనున్నారు. ఈ ఒక్క యాక్షన్ సీక్వెన్స్‌నే దాదాపు నెల రోజుల పాటు చిత్రీకరించనున్నారట. సినిమాలో ఈ హై ఓల్టేజ్ ఫైటే హైలెట్‌గా నిలవనుందట. ఈ యాక్షన్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత.. తదుపరి షెడ్యూల్లో హీరోయిన్ పూజా హెగ్డే జాయిన్ అవనుంది. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలైన సందర్భంగా మహేష్ భార్య నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో SSMB28కి సంబంధించిన టెస్ట్ లుక్‌ను షేర్ చేసుకున్నారు. ఈ లుక్‌లో మహేష్ సూపర్ కూల్‌గా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. చెదిరిన హెయిర్‌తో రఫ్‌గా మీసం, గడ్డంతో ఉన్న ఈ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లేటెస్ట్ లుక్ చూసి మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇకపోతే తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను.. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.