KNR: ఎండాకాలం దృష్ట్యా రైతుల పంటలు ఎండిపోకుండా నీటిని అందించాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హైదరాబాద్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంగళవారం కోరారు. దీంతో రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ నీటిని అధికారులు ఇవాళ విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.