AP: ప్రభుత్వం తనపై కుట్రపూరితంగా కేసులు పెడుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని కూడా ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. ఒక కేసులో బెయిల్ రాగానే మరిన్ని కేసులు నమోదు చేస్తున్నారని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎదుర్కొంటానన్నారు. తనపై జరుగుతున్న వేధింపులకు చంద్రబాబు, లోకేష్‌లే కారణమని, వారిని వదిలే ప్రసక్తి లేదని ధ్వజమెత్తారు.