రాజమహేంద్రవరంలో కలకలం రేపిన కల్తీపాల ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) సుమోటోగా స్వీకరించింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ CS, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, రెండు వారాల్లోగా పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.