వందేభారత్ ఎక్స్ప్రెస్లో ఇచ్చిన ఆహారంలో పురుగులు రావడం కలకలం రేపింది. పట్నా నుంచి టాటానగర్కు వెళ్లే రైలులో రితీష్ కుమార్ అనే వ్యక్తి ప్రయాణిస్తున్న సమయంలో అతడికి ఇచ్చిన పెరుగులో పురుగులు వచ్చాయి. దీంతో సదరు వ్యక్తి దానిని వీడియో తీసి SMలో షేర్ చేశారు. దీనిపై సీరియస్ అయిన రైల్వేశాఖ.. IRCTCకి రూ.10 లక్షలు, సంబంధిత వెండర్కు రూ.50 లక్షల ఫైన్ విధించింది.