AKP: నర్సీపట్నంలో శ్రీ మరిడిమాంబ అమ్మవారి పండగ పురస్కరించుకొని గురువారం ఆర్డివో కార్యాలయంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండగ మూడు రోజులు చక్కగా సాగే విధంగా పోలీస్, మున్సిపాలిటీ, రెవెన్యూ, ఎలక్ట్రికల్, తదితర శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.