VZM: మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. రాష్ట్ర సీఎం చంద్రబాబుపై నమ్మకంతోనే పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని ఆయన చెప్పారు. విశాఖలో గూగుల్ సంస్థ, నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు పడుతున్నాయని పేర్కొన్నారు.