VSP: డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా కెప్టెన్ ఎస్.దివాకర్ బాధ్యతలు స్వీకరించారు. గతేడాది అక్టోబర్ నుంచి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన నియామకానికి డీసీఐ బోర్డు ఆమోదం తెలిపింది. మాస్టర్ ఆఫ్ డ్రెడ్జర్ కీలక నౌకలను నడిపి దేశ, విదేశాల్లో ప్రాజెక్టులు పూర్తి చేశారు.