MDK: నార్సింగి గ్రామపంచాయతీ కార్యాలయంలో 2026-27 సంవత్సరానికి తై బజార్ వేలం ఇవాళ ఉదయం 11 గంటలకు సర్పంచ్ ఆకుల సుజాత, మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఈవో నాగభూషణం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రూ.50,000 డిపాజిట్‌తో వేలంలో పాల్గొనవచ్చన్నారు. అత్యధిక ధర పలికిన వారికి హక్కులు కల్పిస్తామని చెప్పారు.