ATP: నిరుద్యోగ యువతకు ఫోన్ మరమ్మతులపై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు రూడ్సెట్ సంస్థ డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. అనంతపురం జిల్లాకు చెందిన 18 నుంచి 50 ఏళ్ల లోపు గ్రామీణ నిరుద్యోగులు దీనికి అర్హులు. ఏప్రిల్ 2 నుంచి నెల రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణకు ఎంపికైన వారికి ఉచిత భోజనం, వసతి కల్పిస్తారు. వివరాలకు 9492583484 నంబరును సంప్రదించాలని ఆమె కోరారు.