‘Salaar’ మేకర్స్ సీరియస్ వార్నింగ్.. ఇద్దరు అరెస్ట్!
సలార్ సినిమా రిలీజ్ టైం దగ్గర పడటంతో మేకర్స్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇద్దరిని అరెస్ట్ చేసి కటకటాల పాలు చేసినట్టుగా తెలుస్తోంది. మరి సలార్ మేకర్స్ ఎందుకు సీరియస్ అయ్యారు? ఏం చేస్తామంటున్నారు?
Salaar: ఇప్పటి వరకు సలార్ (Salaar) నుంచి అఫీషియల్‌గా వచ్చిన అప్డేట్స్ కంటే లీకులే ఎక్కువగా ఉన్నాయి. ప్రశాంత్ నీల్ జస్ట్ కొన్ని ప్రభాస్‌కు (prabhas) సంబంధించిన లుక్స్ మాత్రమే రివీల్ చేశాడు. ఆన్ సెట్స్ లీక్డ్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. వీడియోలు కూడా ఉన్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సలార్ లీకులు మాత్రం కట్టడి చేయలేకపోయారు. అందుకే సలార్ మేకర్స్ ఎప్పటికప్పుడు సీరియస్ వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. ఈ సారి మాత్రం ఏకంగా ఇద్దరిని అరెస్ట్ చేసి సలార్‌తో జాగ్రత్త అని హెచ్చరించారు. సలార్ కంటెంట్‌ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసిన ఓ ఇద్దరిని సైబర్ క్రైమ్ వారు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.
సినిమా రిలీజ్ టైమ్ దగ్గర పడటంతో లీకుల విషయంలో చిత్ర యూనిట్ మరింత జాగ్రత్తగా వ్యవహరించనున్నట్లు సమాచారం. తమ కంటెంట్ విషయంలో ప్రమేయం లేకుండా ఎవరైనా తప్పుడు పనులు చేస్తే.. వారిపై కఠిన చర్యలు తప్పవని సలార్ ప్రొడక్షన్ హౌస్ నుంచి మీడియాకి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా చెబుతున్నారు. అంటే.. నెక్స్ట్ నుంచి ఎలాంటి లీకులు జరిగినా.. వాటిని షేర్ చేసిన వారికి సైబర్ క్రైమ్ వారి నుంచి చిక్కులు తప్పవన్న మాట. అందుకే.. సలార్ రిలీజ్ వరకు లీక్ రాయుళ్లు, వాటిని షేర్ చేసే వారు కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్ అంటున్నారు.
డిసెంబర్ 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది సలార్. ఇప్పటికే ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. త్వరలో ఇండియాలో కూడా బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. ఈ లోపు డిసెంబర్ 1వ తేదీన సలార్ ట్రైలర్ రిలీజ్ కానుంది. ప్రస్తుతం ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.