అన్నమయ్య: మదనపల్లె బసినికొండలో బుధవారం బీజేపీ జిల్లా సమగ్రసవరణ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సాయిలోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని, ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవడం కూడా అంతే కీలకమని ఆయన సూచించారు.